మార్చి నాటికి ప్రిడేటర్‌ డ్రోన్ల ఒప్పందం ఖరారు

అమెరికా నుంచి 31 ఎంక్యూ-9బి ప్రిడేటర్‌ సాయుధ డ్రోన్ల కొనుగోలుకు ఉద్దేశించిన కీలక ఒప్పందాన్ని వచ్చే ఏడాది మార్చి నాటికి ఖరారు చేసుకోవాలని భారత్‌ భావిస్తోంది.

Published : 28 Nov 2023 04:32 IST

దిల్లీ: అమెరికా నుంచి 31 ఎంక్యూ-9బి ప్రిడేటర్‌ సాయుధ డ్రోన్ల కొనుగోలుకు ఉద్దేశించిన కీలక ఒప్పందాన్ని వచ్చే ఏడాది మార్చి నాటికి ఖరారు చేసుకోవాలని భారత్‌ భావిస్తోంది. కొన్నివారాల్లో అమెరికా కాంగ్రెస్‌ ఈ విక్రయానికి ఆమోదం తెలిపే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ డ్రోన్ల కొనుగోలుకు భారత్‌ జారీ చేసిన ‘లెటర్‌ ఆఫ్‌ రిక్వెస్ట్‌’కు అమెరికా స్పందించాక రెండు దేశాల అధికారులు తుదివిడత చర్చలు జరుపుతారని వివరించాయి. తన సైనిక బలగాల నిఘా సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి ఈ ‘హంటర్‌-కిల్లర్‌’ డ్రోన్లను కొనుగోలు చేయాలని భారత్‌ నిర్ణయించింది. ముఖ్యంగా చైనా వెంబడి ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి ఇవి అవసరమని భావిస్తోంది. ఈ డ్రోన్ల ధరను తదుపరి చర్చల్లో ఖరారు చేస్తారు. అయితే, ఈ కాంట్రాక్టు విలువ దాదాపు 300 కోట్ల డాలర్ల మేర ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. చాలా ఎక్కువ ఎత్తులో విహరించగలిగే ఈ డ్రోన్లు ఏకబిగిన 35 గంటలకుపైగా గాల్లో ఉండగలవు. ఇవి నాలుగు హెల్‌ఫైర్‌ క్షిపణులను, 450 కిలోల బాంబులను మోసుకెళ్లగలవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని