కేజ్రీవాల్‌కు గోవా కోర్టు సమన్లు

ఆప్‌ జాతీయ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు గోవా కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారన్న ఆరోపణలపై మపూసా ఫస్ట్‌క్లాస్‌ జుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ జారీచేసిన ఈ సమన్లలో బుధవారం కోర్టు ముందు హాజరు కావలసిందిగా పేర్కొన్నారు.

Published : 29 Nov 2023 04:04 IST

పణజీ: ఆప్‌ జాతీయ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు గోవా కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారన్న ఆరోపణలపై మపూసా ఫస్ట్‌క్లాస్‌ జుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ జారీచేసిన ఈ సమన్లలో బుధవారం కోర్టు ముందు హాజరు కావలసిందిగా పేర్కొన్నారు. లంచం వ్యవహారానికి సంబంధించి ప్రజాప్రాతినిధ్య చట్టం, ఐపీసీ సెక్షన్‌ 171 కింద కేజ్రీవాల్‌పై ఈ కేసు నమోదైనట్లు కోర్టు వర్గాలు తెలిపాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీ గోవా చీఫ్‌, న్యాయవాది అయిన అమిత్‌ పాలేకర్‌ దీనిపై మాట్లాడుతూ..‘‘బుధవారం హాజరుకావాలని ఒకరోజు ముందు సమన్లు జారీ చేశారు. 2018లో ఈ కేసు చార్జిషీటు దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇంతకుమించి కేసు వివరాలేం తెలియదు. కేజ్రీవాల్‌ తరఫున నేను కోర్టులో హాజరవుతాను. కేసు వివరాలు మా చేతికి వచ్చాక ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేసే విషయం పరిశీలిస్తాం’’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని