బిపిన్‌ రావత్‌ మృతిపై దర్యాప్తు విరమణ

త్రివిధ దళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ సహా 14 మంది మృతి చెందిన ఘటనలో కేసు దర్యాప్తును విరమించుకుంటున్నట్లు తమిళనాడు పోలీసుశాఖ ప్రకటించింది.

Published : 29 Nov 2023 05:44 IST

తమిళనాడు పోలీసుశాఖ ప్రకటన

ప్యారిస్‌, న్యూస్‌టుడే: త్రివిధ దళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ సహా 14 మంది మృతి చెందిన ఘటనలో కేసు దర్యాప్తును విరమించుకుంటున్నట్లు తమిళనాడు పోలీసుశాఖ ప్రకటించింది. 2021లో నీలగిరి జిల్లా కున్నూర్‌లో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో రావత్‌, ఆయన భార్య సహా 14 మంది మృతిచెందారు. అప్పట్లో కున్నూర్‌ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. దీనిపై త్రివిధ దళ విచారణ కమిటీ కూడా ఏర్పాటైంది. ఈ కమిటీ 2022 జనవరి 14న మొదటి విడత నివేదిక ఇచ్చింది. వాతావరణంలో ఆకస్మిక మార్పు కారణంగా ప్రమాదం జరిగిందని, సాంకేతిక లోపం, విధ్వంసం, నిర్లక్ష్యం వంటివేవీ లేవని పేర్కొంది. అనంతరం తమిళనాడు పోలీసుశాఖ దర్యాప్తు చేపట్టింది. దట్టమైన మబ్బులున్న ప్రాంతంలో వెళ్తుండగా ప్రమాదం జరిగిందని, కుట్ర లేదని వెల్లడించింది. హెలికాప్టర్‌ డేటా, కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డ్‌లాంటి ఆధారాలు లభించలేదని ఇన్నాళ్లూ దర్యాప్తును పెండింగ్‌లో పెట్టింది. తాజాగా దర్యాప్తును విరమించుకుంటున్నట్లు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని