వృత్తలేఖినితో దాడి కేసు జువైనల్‌ జస్టిస్‌ బోర్డుకు

మధ్యప్రదేశ్‌లో ఇందౌర్‌లో తమ తోటి విద్యార్థిని మరో ముగ్గురు విద్యార్థులు వృత్తలేఖిని (జామెట్రీ కంపాస్‌)తో పొడిచిన కేసును జువైనల్‌ జస్టిస్‌ బోర్డుకు అప్పగించాలని ఇందౌర్‌ పోలీసులు నిర్ణయించారు.

Published : 29 Nov 2023 06:09 IST

ఇందౌర్‌: మధ్యప్రదేశ్‌లో ఇందౌర్‌లో తమ తోటి విద్యార్థిని మరో ముగ్గురు విద్యార్థులు వృత్తలేఖిని (జామెట్రీ కంపాస్‌)తో పొడిచిన కేసును జువైనల్‌ జస్టిస్‌ బోర్డుకు అప్పగించాలని ఇందౌర్‌ పోలీసులు నిర్ణయించారు. అలాగే బాధిత విద్యార్థి వైద్య నివేదిక సహా ఇతర పత్రాలతోపాటు ఈ వ్యవహారంతో సంబంధం గల విద్యార్థుల సామాజిక స్థితిగతులపైనా రూపొందించిన నివేదికను వారు బోర్డుకు సమర్పించనున్నారు. ఈ మేరకు ఓ పోలీసు అధికారి మంగళవారం వెల్లడించారు. ఈ నెల 24న ఓ ప్రైవేటు పాఠశాలలో జరిగిన ఈ ఘటనలో 4వ తరగతికి చెందిన ఓ విద్యార్థిపై అదే తరగతికి చెందిన మరో ముగ్గురు విద్యార్థులు వృత్తలేఖినితో వందసార్లకు పైగా పొడిచారు. వీరంతా 10 సంవత్సరాలలోపు వారు కావడం గమనార్హం. అయితే వారి మధ్య గొడవకు దారితీసిన అసలు కారణమేమిటనేది తెలియరాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని