సామాజిక మాధ్యమాల్లోని సమాచారంతో పిల్‌

సామాజిక మాధ్యమాల నుంచి సేకరించిన సమాచారంతో ఓ న్యాయవాది ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేయడాన్ని బాంబే హైకోర్టు తప్పుబట్టింది. అలాంటి గణాంకాలతో వాదనలు వినిపించడం సరికాదని హితవు పలికింది.

Published : 29 Nov 2023 06:11 IST

పిటిషనర్‌ను తప్పుబట్టిన బాంబే హైకోర్టు

ముంబయి: సామాజిక మాధ్యమాల నుంచి సేకరించిన సమాచారంతో ఓ న్యాయవాది ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేయడాన్ని బాంబే హైకోర్టు తప్పుబట్టింది. అలాంటి గణాంకాలతో వాదనలు వినిపించడం సరికాదని హితవు పలికింది. మహారాష్ట్రలో అసురక్షిత జలపాతాలు, నీటివనరుల వద్ద ఏటా 1,500-2,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారని పిల్‌లో పేర్కొన్నారు. వాటివద్ద సముచిత స్థాయిలో భద్రతా చర్యలు చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ అందులో కోరారు. పిల్‌ను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.కె.ఉపాధ్యాయ, జస్టిస్‌ ఆరిఫ్‌ డాక్టర్‌ల ధర్మాసనం.. మరణాలపై సమాచారాన్ని ఎక్కడి నుంచి సేకరించారని పిటిషనర్‌ను ప్రశ్నించింది. కొన్ని వార్తాపత్రికలతోపాటు సామాజిక మాధ్యమాల్లోని పోస్టుల నుంచి ఆ గణాంకాలను తీసుకున్నట్లు తెలియజేయడంతో ఆయన్ను తప్పుబట్టింది. అవసరమైతే సరైన వివరాలతో మళ్లీ పిటిషన్‌ దాఖలు చేయాలని సూచించింది. దీంతో పిల్‌ను పిటిషనర్‌ ఉపసంహరించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని