ఆ పోస్టుకు మరో ఐఏఎస్‌ అధికారి లేరా?

మరో ఆరు నెలల పాటు దిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌)గా నరేశ్‌ కుమార్‌ను కొనసాగించాలని భావిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలియజేయడంతో సుప్రీంకోర్టు మంగళవారం కీలక ప్రశ్నలను సంధించింది.

Published : 29 Nov 2023 06:12 IST

దిల్లీ సీఎస్‌ పదవీకాలం పొడిగింపు ప్రతిపాదనపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం

దిల్లీ: మరో ఆరు నెలల పాటు దిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌)గా నరేశ్‌ కుమార్‌ను కొనసాగించాలని భావిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలియజేయడంతో సుప్రీంకోర్టు మంగళవారం కీలక ప్రశ్నలను సంధించింది. ‘దిల్లీ సీఎస్‌గా నియమితులు కావడానికి అర్హతలున్న మరో ఐఏఎస్‌ అధికారే మీకు లేరా? ఏ అధికారంతో అలా చేయాలనుకుంటున్నార’ంటూ నిలదీసింది. పదవీ కాలం పొడిగింపు ప్రతిపాదనకు గల కారణాలను బుధవారం లోగా వివరించాలని ఆదేశించింది. నరేశ్‌ కుమార్‌ ఈ నెల 30న పదవీ విరమణ చేయాల్సి ఉండగా...ఆయన స్థానంలో కొత్త సీఎస్‌ను నియమించే విషయమై దిల్లీలోని ఆప్‌ ప్రభుత్వం, కేంద్ర సర్కారు మధ్య వివాదం నెలకొంది. తమను సంప్రదించకుండానే లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కొత్త సీఎస్‌ను నియమించటానికి ప్రయత్నిస్తున్నారంటూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరుపుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని