అడ్డంకులు అధిగమించి.. ఉత్కంఠకు తెరదించి!

ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్‌ మార్గంలో నిర్మాణంలో ఉన్న సిల్‌క్యారా సొరంగం పాక్షికంగా కూలిపోవడంతో దాని లోపల చిక్కుకుపోయిన 41 మంది కూలీలు. వారిని రక్షించేందుకు రంగంలోకి దిగిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, బీఆర్‌వో, ఐటీబీపీ తదితర బలగాలు.

Updated : 29 Nov 2023 06:30 IST

ఉత్తరాఖండ్‌ సొరంగంలో 17 రోజులు సహాయక చర్యలు కొనసాగాయిలా..

నవంబరు 12

ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్‌ మార్గంలో నిర్మాణంలో ఉన్న సిల్‌క్యారా సొరంగం పాక్షికంగా కూలిపోవడంతో దాని లోపల చిక్కుకుపోయిన 41 మంది కూలీలు. వారిని రక్షించేందుకు రంగంలోకి దిగిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, బీఆర్‌వో, ఐటీబీపీ తదితర బలగాలు. కూలీలకు ఆక్సిజన్‌ సరఫరా చేసేందుకు చురుగ్గా సాగిన ఏర్పాట్లు.

 నవంబరు 13: సొరంగంలో చిక్కుకున్న కూలీలతో చిన్న పైప్‌ ద్వారా ఏర్పడిన అనుసంధానత. వారంతా క్షేమంగా ఉన్నారని నిర్ధారణ  

..14:  కూలీలను బయటకు తీసుకొచ్చేందుకు అడ్డంగా తవ్వకాలు జరిపి 800-900 మిల్లీమీటర్ల వ్యాసమున్న స్టీల్‌పైప్‌లు వేసేందుకు ఏర్పాట్లు. లోపల మట్టిపెళ్లలు విరిగిపడటంతో ఇద్దరు కూలీలకు గాయాలు

..15:  సహాయక చర్యలను ముమ్మరం చేసేందుకు దిల్లీ నుంచి అత్యాధునిక ఆగర్‌ యంత్రం తరలింపు

..16:  సొరంగం వద్ద డ్రిల్లింగ్‌ యంత్రం మోహరింపు

..17:  57 మీటర్ల మేర తవ్వకం లక్ష్యం కాగా.. అందులో 24 మీటర్ల మేర పని పూర్తి. 4 పైపులు వేసిన అనంతరం అయిదో పైపు వేస్తుండగా అడ్డంకి ఎదురవడంతో డ్రిల్లింగ్‌ నిలిపివేత

..18:  ఆగర్‌ యంత్రం వల్ల ఉత్పత్తయ్యే ప్రకంపనలతో సొరంగంలో మట్టిపెళ్లలు మరింతగా విరిగిపడే ముప్పుందని ఆందోళన వ్యక్తం చేసిన నిపుణులు. నిలువుగా తవ్వడం సహా 5 విధాల ప్రత్యామ్నాయ సహాయక చర్యలను ఏకకాలంలో చేపట్టాలని ఉన్నతాధికారుల నిర్ణయం

..19:  పునఃప్రారంభమవని డ్రిల్లింగ్‌. సహాయక పనులపై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ సమీక్ష

..20: ఉత్తరాఖండ్‌ సీఎం ధామీతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ. సహాయక చర్యలపై ఆరా. పెద్ద బండరాయి అడ్డుగా ఉండటంతో ఇంకా పునఃప్రారంభమవని డ్రిల్లింగ్‌

..21: లోపల చిక్కుకున్న కూలీలకు సంబంధించిన తొలి వీడియో విడుదల. అడ్డంగా (హారిజాంటల్‌) తవ్వే పనులు పునఃప్రారంభం. ప్రత్యామ్నాయంగా సొరంగానికి మరోవైపు నుంచీ తవ్వకాలు మొదలు.

..22: 45 మీటర్ల మేర సమాంతర డ్రిల్లింగ్‌ పూర్తి. మరో 12 మీటర్ల మేర మాత్రమే మిగిలి ఉన్న పనులు. కూలీల కోసం సిద్ధమైన అంబులెన్సులు. ఇంతలో అనూహ్యంగా ఇనుప రాడ్లు అడ్డురావడంతో నిలిచిపోయిన డ్రిల్లింగ్‌

..23:  ఆరు గంటల శ్రమ తర్వాత ఇనుప రాడ్ల తొలగింపు. అయితే డ్రిల్లింగ్‌ యంత్రాన్ని నిలిపి ఉంచిన వేదికకు పగుళ్లు రావడంతో పనుల నిలిపివేత

..24:  పునఃప్రారంభమైన డ్రిల్లింగ్‌. లోహ గడ్డర్‌ అడ్డుగా రావడంతో మళ్లీ పనుల నిలిపివేత

..25:  విరిగిపోయిన ఆగర్‌ బ్లేడ్లు. మిగిలిన దూరాన్ని మనుషులతో తవ్వించడం, 86 మీటర్ల మేర నిలువు డ్రిల్లింగ్‌ అనే రెండు ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారుల మల్లగుల్లాలు

..26:  ప్రత్యామ్నాయ మార్గంగా.. నిట్టనిలువున 19.2 మీటర్ల మేర తవ్వకం పూర్తి

..27:  నిలువుగా 36 మీటర్ల తవ్వకం పూర్తి. హారిజాంటల్‌ డ్రిల్లింగ్‌లో సహాయం చేసేందుకు సొరంగం వద్దకు చేరుకున్న ర్యాట్‌హోల్‌ మైనింగ్‌ నిపుణులు

నవంబరు 28: ర్యాట్‌హోల్‌ మైనింగ్‌ నిపుణుల సాయంతో హారిజాంటల్‌ డ్రిల్లింగ్‌ పూర్తి. సొరంగం నుంచి సురక్షితంగా బయటకొచ్చిన కార్మికులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని