విధానసౌధ వాకిట గజరాజులు

చారిత్రక బెంగళూరు విధానసౌధ ఆవరణలో అసలైన ఏనుగులను తలపించేలా గజరాజుల బొమ్మలు ఏర్పాటు చేశారు.

Published : 30 Nov 2023 05:24 IST

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : చారిత్రక బెంగళూరు విధానసౌధ ఆవరణలో అసలైన ఏనుగులను తలపించేలా గజరాజుల బొమ్మలు ఏర్పాటు చేశారు. వనసీమలోనే ప్రత్యేక గుర్తింపు ఉన్న లాంటానా కమేరా జాతి చెట్టు కలపతో తమిళనాడుకు చెందిన గిరిజన కళాకారులు 100కుపైగా చిన్నాపెద్ద ఏనుగు బొమ్మలను తయారు చేశారు. వీటిలో కొన్నింటిని బెంగళూరులోని భారతీయ విజ్ఞాన సంస్థ (ఐఐఎస్‌సీ) ఆవరణలో కొలువుదీర్చారు. 15 బొమ్మలను విధానసౌధ వద్ద ఏర్పాటు చేశారు. నెల పాటు వీటిని ఇక్కడే ఉంచుతామని వాటి నిర్వహణ వ్యవహారాలు చూస్తున్న కళానిపుణుడు సుభాష్‌ గౌతమ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని