దిల్లీ విమానం ఆరున్నర గంటల ఆలస్యం

దిల్లీ విమాన సర్వీస్‌ ఆరున్నర గంటలు ఆలస్యంగా వెళ్లిన సంఘటన శంషాబాద్‌ విమానాశ్రయంలో బుధవారం చోటు చేసుకుంది.

Published : 30 Nov 2023 04:54 IST

శంషాబాద్‌, న్యూస్‌టుడే: దిల్లీ విమాన సర్వీస్‌ ఆరున్నర గంటలు ఆలస్యంగా వెళ్లిన సంఘటన శంషాబాద్‌ విమానాశ్రయంలో బుధవారం చోటు చేసుకుంది. ఎయిర్‌పోర్ట్‌ అధికారుల వివరాల ప్రకారం.. స్పైస్‌ జెట్‌ ఎయిర్‌లైన్స్‌లో ఉదయం 6 గంటలకు దిల్లీ వెళ్లడానికి 160 మంది టికెట్లు తీసుకొన్నారు. వారంతా తనిఖీలు పూర్తి చేసుకొని ఎదురుచూస్తున్నారు. ఎంతకీ విమానం రాకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. మూడు గంటలు గడుస్తున్నా సరైన సమాచారం అందకపోవడంతో సహనం కోల్పోయిన ప్రయాణికులు ధర్నా చేశారు. దీంతో సాంకేతిక లోపం కారణంగా సర్వీస్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మధ్యాహ్నం 12.30కు మరో విమానంలో దిల్లీ పంపించడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రయాణాన్ని వాయిదా వేసుకున్న వారికి టికెట్ల డబ్బు పూర్తిస్థాయిలో వెనక్కి ఇస్తామని హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని