సంక్షిప్త వార్తలు

హిమాలయ ప్రాంత పర్యావరణ వ్యవస్థ సున్నితత్వం, సంక్లిష్టతలను సిల్‌క్యారా సొరంగ ప్రమాద ఘటన మన కళ్లకు కట్టింది. ఇక్కడి ప్రాజెక్టుల మదింపు ప్రక్రియ వైఫల్యం కూడా వెలుగులోకి వచ్చింది.

Updated : 30 Nov 2023 06:21 IST

సొరంగ ప్రమాదం నుంచిపాఠాలు నేర్వాలి

హిమాలయ ప్రాంత పర్యావరణ వ్యవస్థ సున్నితత్వం, సంక్లిష్టతలను సిల్‌క్యారా సొరంగ ప్రమాద ఘటన మన కళ్లకు కట్టింది. ఇక్కడి ప్రాజెక్టుల మదింపు ప్రక్రియ వైఫల్యం కూడా వెలుగులోకి వచ్చింది. ఇకనైనా ఈ ప్రాంతంలోని అన్ని ప్రాజెక్టులను భద్రత దృష్ట్యా క్షుణ్నంగా తనిఖీలు చేయాలి. భవిష్యత్తులో నిర్మించనున్న ప్రాజెక్టులను ఆపివేసి, పర్యావరణపరమైన మదింపు చేపట్టాలి.

జైరాం రమేశ్‌


సమష్టి కృషితో ఏదైనా సాధ్యమే

సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికుల విలువైన ప్రాణాలు కాపాడేందుకు 17 రోజులుగా శ్రమించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఏ క్రీడావిజయం ఇవ్వనంత ఆనందాన్ని మీరు అందించారు. ఈ చర్యతో మీరు ఓ దేశం స్ఫూర్తిని పెంచారు. సమష్టిగా కృషి చేస్తే ఏదీ అసాధ్యం కాదని నిరూపించారు.

ఆనంద్‌ మహీంద్రా


ప్రతి ఆరుగురిలో ఒకరిపై వివక్ష

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒకరు ఏదో రూపంలో వివక్షను ఎదుర్కొంటున్నారు. దీనిపై సాకులు చెప్పడం మానేయాల్సిన సమయం వచ్చింది. సమ్మిళిత విధానాలు, హక్కుల పరిరక్షణ, చర్చలను ప్రోత్సహించడం ద్వారా వివక్షను రూపుమాపేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలి.

యునెస్కో


కొవిడ్‌ ముప్పు పొంచే ఉంది

కొవిడ్‌-19 వ్యాప్తి ఇంకా ముగిసిపోలేదు. ఇప్పటికీ అది ప్రజలకు ప్రాణాపాయంగా ఉంది. ఇంతవరకూ టీకా తీసుకోనివారు తప్పకుండా కనీసం ఒక డోసైనా తీసుకోవాలి. ఈ విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు. వెంటనే స్థానిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించి టీకా తీసుకోండి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని