మేం దిల్లీ వీడుతాం!

ముంబయి, దిల్లీ నగర వాసులను వాయు కాలుష్యం బెంబేలెత్తిస్తోంది. దీని బారి నుంచి తప్పించుకోవడానికి ఇతర ప్రాంతాలకు వెళ్లే యోచన కూడా చేస్తున్నారు.

Published : 30 Nov 2023 05:08 IST

 ప్రతి 10 మందిలో ఆరుగురి మాట
ఇదే దారిలో ముంబయి వాసులు కూడా
వాయు కాలుష్యంపై తాజా సర్వేలో వెల్లడి

 దిల్లీ: ముంబయి, దిల్లీ నగర వాసులను వాయు కాలుష్యం బెంబేలెత్తిస్తోంది. దీని బారి నుంచి తప్పించుకోవడానికి ఇతర ప్రాంతాలకు వెళ్లే యోచన కూడా చేస్తున్నారు. ఆరోగ్య సమస్యల నుంచి కాపాడుకోవడానికి ఇదే సరైన మార్గమని అభిప్రాయపడుతున్నారు. ఈ నగరాల్లో నివసిస్తున్న ప్రతి పది మందిలో ఆరుగురు... వేరే ప్రాంతాల్లో స్థిరపడదామన్న అభిప్రాయాన్ని తమ సర్వేలో వ్యక్తం చేశారని ‘ప్రిస్టీన్‌ కేర్‌’ అనే సంస్థ వెల్లడించింది. వాయు నాణ్యతా సూచీ పడిపోవడంతో రకరకాల ఆరోగ్య సమస్యల (నిరంతర దగ్గు, శ్వాస ఇబ్బందులు, గురక, గొంతునొప్పి)తో ఇబ్బంది పడుతున్నామని ఈ సర్వేలో ప్రతి పది మందిలో 9 మంది చెప్పడం గమనార్హం. ఆస్తమా, బ్రాంకైటిస్‌లతో ఇబ్బంది పడుతున్న వారి ఆరోగ్యం శీతాకాలంలో మరింత దిగజారిపోతోందని 40 శాతం మంది పేర్కొన్నారు. కాలుష్యం బారిన పడకుండా ఉండేందుకు బయటకు వెళ్లడం కూడా తగ్గించేశామని.. నడక, వ్యాయామాలు చేయడానికి పార్కులకు లేదని వెళ్లడం లేదని 35 శాతం మంది తెలిపారు. బయటికి వెళ్లినా మాస్కులు ధరిస్తున్నామని 30 శాతం మంది సర్వేలో చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని