పల్లెటూరి మేడం యూట్యూబ్‌ ఆంగ్ల పాఠాలు అదుర్స్‌

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కౌశాంబీ జిల్లా సిరాథూ నగర పంచాయతీకి చెందిన యశోద అనే గ్రామీణ యువతి ఆంగ్ల బోధనకు యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించి విశేష ఆదరణ చూరగొంటోంది.

Published : 01 Dec 2023 06:40 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కౌశాంబీ జిల్లా సిరాథూ నగర పంచాయతీకి చెందిన యశోద అనే గ్రామీణ యువతి ఆంగ్ల బోధనకు యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించి విశేష ఆదరణ చూరగొంటోంది. ఈమె కేవలం ఇంటర్మీడియట్‌ పూర్తిచేసి, అనివార్య కారణాల వల్ల చదువును మధ్యలోనే ఆపేసింది. మంచి అధ్యాపకురాలు కావాలన్న కోరిక మాత్రం యశోదకు బలంగా ఉండేది. ఈ నేపథ్యంలో ఆంగ్లభాషపై తనకున్న పట్టుతో ‘ఇంగ్లిష్‌ విత్‌ దేహాతీ మేడం’ పేరిట యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించింది. తనలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఔత్సాహికులకు ఆంగ్లభాష, వ్యాకరణాంశాలను ఆమె నేర్పిస్తోంది. క్రియారూపాలు ఎలా ఉపయోగించాలి? బిడియపడకుండా ఆంగ్లం మాట్లాడటం ఎలా? రోజువారీ పనుల్లో ఆంగ్ల వినియోగం వంటి అంశాలపై యశోద వీడియోలు అప్‌లోడ్‌ చేస్తోంది. ఈమె ఛానల్‌కు 2.88 లక్షల చందాదారులు ఉన్నారు. ఛానల్‌ ప్రారంభించిన ఏడాదిలోనే మంచి ప్రజాదరణతో కుటుంబ ఆర్థికకష్టాలు తొలగినట్లు యశోద చెబుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని