స్టే ఉత్తర్వుల గడువుపై పునఃపరిశీలన

సివిల్‌, క్రిమినల్‌ కేసుల్లో దిగువ కోర్టు లేదా హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను ప్రత్యేకంగా పొడిగిస్తే తప్ప, ఆ ఉత్తర్వులకు ఆరు నెలల్లో గడువు తీరిపోతుందని 2018లో సుప్రీం త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారంనాడు అయిదుగురు సభ్యుల ధర్మాసనానికి నివేదించింది.

Published : 02 Dec 2023 03:50 IST

దిల్లీ: సివిల్‌, క్రిమినల్‌ కేసుల్లో దిగువ కోర్టు లేదా హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను ప్రత్యేకంగా పొడిగిస్తే తప్ప, ఆ ఉత్తర్వులకు ఆరు నెలల్లో గడువు తీరిపోతుందని 2018లో సుప్రీం త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారంనాడు అయిదుగురు సభ్యుల ధర్మాసనానికి నివేదించింది. 226వ రాజ్యాంగ అధికరణం హైకోర్టులకు ఇచ్చిన అధికారాలను 2018నాటి సుప్రీం తీర్పు పరిహరిస్తోందంటూ అలహాబాద్‌ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది రాకేశ్‌ ద్వివేది పిటిషన్‌ దాఖలుచేశారు. దాన్ని పురస్కరించుకుని సుప్రీం పై నిర్ణయం తీసుకుంది. ఆ తీర్పు ప్రకారం స్టే గడువు ఆరు నెలల్లో తీరిపోవడం న్యాయసాధనకు దోహదం చేయదని తామూ భావిస్తున్నామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ జె.బి.పార్ధీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. అందుకే ఆసియన్‌ రీసర్ఫేసింగ్‌ ఆఫ్‌ రోడ్‌ ఏజెన్సీ సంస్థ వెర్సెస్‌ సీబీఐ కేసులో 2018 నాటి తీర్పును అయిదుగురు సభ్యుల ధర్మాసనానికి నివేదిస్తున్నామని ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని