మొయిత్రా బహిష్కరణపై ఎథిక్స్‌ కమిటీ సిఫార్సు 4న లోక్‌సభ ముందుకు

ప్రశ్నలు అడిగినందుకు డబ్బు’ వివాదంలో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాకు వ్యతిరేకంగా పార్లమెంటు ఎథిక్స్‌ కమిటీ చేసిన సిఫార్సు లోక్‌సభ ముందుకు రానుంది.

Published : 02 Dec 2023 03:58 IST

దిల్లీ: ‘ప్రశ్నలు అడిగినందుకు డబ్బు’ వివాదంలో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాకు వ్యతిరేకంగా పార్లమెంటు ఎథిక్స్‌ కమిటీ చేసిన సిఫార్సు లోక్‌సభ ముందుకు రానుంది. ఆమెను లోక్‌సభ నుంచి బహిష్కరించాలని నవంబరు 9న కమిటీ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నివేదికను ఎథిక్స్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌ వినోద్‌ కుమార్‌ సోంకర్‌ దిగువసభలో 4న ప్రవేశపెడతారని లోక్‌సభ సచివాలయ అజెండా పత్రం వెల్లడించింది. సభ ఆమోదించినట్లయితే మొయిత్రాపై బహిష్కరణ వేటు పడుతుంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమై ఈ నెల 22 వరకు కొనసాగుతాయి. ఎథిక్స్‌ కమిటీలో ఆరుగురు బహిష్కరణ సిఫార్సును సమర్థించగా విపక్షాలకు చెందిన నలుగురు సభ్యులు విభేదించారు. మొయిత్రాపై ఆరోపణలు చేసిన భాజపా ఎంపీ దుబే సరైన ఆధారాలు సమర్పించలేదని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని