ఇదేం పెళ్లిరా బాబూ!

బిహార్‌లోని వైశాలి జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఇటీవలే ఉద్యోగం సాధించిన యువకుడిని ఓ వ్యక్తి కిడ్నాప్‌ చేసి.. తన కుమార్తె మెడలో బలవంతంగా తాళి కట్టించాడు.

Published : 02 Dec 2023 05:33 IST

తుపాకీ ఎక్కుపెట్టి.. తాళి కట్టించారు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: బిహార్‌లోని వైశాలి జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఇటీవలే ఉద్యోగం సాధించిన యువకుడిని ఓ వ్యక్తి కిడ్నాప్‌ చేసి.. తన కుమార్తె మెడలో బలవంతంగా తాళి కట్టించాడు. బిహార్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలో అర్హత సాధించిన గౌతమ్‌కుమార్‌ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరాడు. బుధవారం మధ్యాహ్నం కారులో వచ్చిన కొందరు వ్యక్తులు.. గౌతమ్‌ను బలవంతంగా ఎక్కించుకొని వెళ్లిపోయారు. ఈ విషయం తెలిసి ఆయన కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. రాజేశ్‌రాయ్‌ అనే వ్యక్తి గతంలో తన కుమార్తె చాందినీని పెళ్లి చేసుకోవాల్సిందిగా గౌతమ్‌ను కోరాడని, అతడు తిరస్కరించడంతో భౌతికదాడి కూడా చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు వెళ్లే సమయానికి.. అప్పటికే గౌతమ్‌, చాందినీల వివాహం జరిపించిన రాజేశ్‌ కొత్త దంపతుల్ని తన ఇంట్లోనే బంధించాడు. తుపాకీ ఎక్కుపెట్టి తనతో తాళి కట్టించారని గౌతమ్‌ పోలీసుల ఎదుట వాపోయాడు. నిందితులపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని