గ్రీన్‌ క్రెడిట్స్‌ కార్యక్రమానికి మోదీ శ్రీకారం

బంజరు భూముల్లో మొక్కల పెంపకం ద్వారా గ్రీన్‌ క్రెడిట్స్‌ను పొందడంపై దృష్టిసారించే  కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం  కాప్‌28లో శ్రీకారం చుట్టారు.

Published : 02 Dec 2023 04:02 IST

దుబాయ్‌: బంజరు భూముల్లో మొక్కల పెంపకం ద్వారా గ్రీన్‌ క్రెడిట్స్‌ను పొందడంపై దృష్టిసారించే  కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం  కాప్‌28లో శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..గ్రీన్‌ క్రెడిట్ల కార్యక్రమం వాణిజ్య స్వభావం కలిగిన కార్బన్‌ క్రెడిట్ల కంటే ఉత్తమమైందన్నారు. ‘‘కార్బన్‌ క్రెడిట్లను వాణిజ్య దృక్పథంతో నిర్వహిస్తున్నారు. దీనికి తక్కువ అవకాశాలున్నాయి. సమూహ బాధ్యత ఉండదు. స్వప్రయోజనాలకు విలువిచ్చే విధ్వంసకర ఆలోచనా ధోరణుల నుంచి మనం దూరం జరగాలి’’ అని మోదీ పేర్కొన్నారు.

స్వదేశానికి చేరుకున్న ప్రధాని..

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ఆధ్వర్యంలో దుబాయ్‌లో జరిగిన ప్రపంచ వాతావరణ కార్యాచరణ సదస్సు(కాప్‌28)లో పాల్గొన్న ప్రధాని మోదీ శుక్రవారం అర్ధరాత్రి దాటాక భారత్‌కు చేరుకున్నారు. అంతకు ముందు ‘దుబాయ్‌లో ఫలవంతమైన పర్యటన ముగించుకున్నాక ప్రధాని మోదీ దిల్లీకి బయలుదేరారు’ అంటూ ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్‌’లో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని