వాస్తవాలను మరుగుపరుస్తున్న నకిలీ వార్తలు

నకిలీ వార్తలు వెల్లువలో వాస్తవ సమాచారం మరుగునపడిపోతోందని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ తెలిపారు.

Published : 02 Dec 2023 04:03 IST

సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ వ్యాఖ్య

దిల్లీ: నకిలీ వార్తలు వెల్లువలో వాస్తవ సమాచారం మరుగునపడిపోతోందని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ తెలిపారు. అసత్య వార్తలతో ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలుగుతుందని చెప్పారు. శుక్రవారం ఆయన ఇక్కడ ఒక సదస్సులో ‘డిజిటల్‌ యుగంలో పౌర హక్కుల సంరక్షణ’ అనే అంశంపై ప్రసంగించారు. నకిలీ వార్తలు సమాజ పునాదుల సుస్థిరతను దెబ్బతీస్తాయన్నారు. ఇలాంటి అసత్య సమాచారం వల్ల హింస చెలరేగడాన్ని నిత్యం చూస్తున్నామని చెప్పారు. పలు దేశాల్లో ఎన్నికలు, పౌర సమాజానికి నకిలీ వార్తలు పెద్ద బెడదగా మారాయన్నారు. ‘‘కొవిడ్‌-19 మహమ్మారి సమయంలో ఇంటర్నెట్‌లో  నకిలీ వార్తలు, వదంతులు తీవ్రస్థాయిలో వచ్చాయి. ఇవి సరదాగా అనిపించొచ్చు. అయితే, ఇంటర్నెట్‌లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పరిధిపై మనల్ని ఆలోచింపచేస్తున్నాయి’’ అని వ్యాఖ్యానించారు. ముఖాన్ని గుర్తించే పరిజ్ఞానం.. అద్భుత సాంకేతిక ఆవిష్కరణే అయినప్పటికీ దానివల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం, వివక్ష వంటి సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని