నేవీ నౌకకు తొలి మహిళా కమాండింగ్‌ అధికారి

‘అన్ని ర్యాంకులు, అన్ని పాత్రల్లో మహిళా సిబ్బందికి అవకాశం’ అన్న సూత్రానికి అనుగుణంగా నేవీ ఓడలో తొలి మహిళా కమాండింగ్‌ అధికారిని నియమించినట్లు నౌకాదళ అధిపతి అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ తెలిపారు.

Published : 02 Dec 2023 04:05 IST

నౌకాదళాధిపతి అడ్మిరల్‌ ఆర్‌ హరికుమార్‌ వెల్లడి

దిల్లీ: ‘అన్ని ర్యాంకులు, అన్ని పాత్రల్లో మహిళా సిబ్బందికి అవకాశం’ అన్న సూత్రానికి అనుగుణంగా నేవీ ఓడలో తొలి మహిళా కమాండింగ్‌ అధికారిని నియమించినట్లు నౌకాదళ అధిపతి అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ తెలిపారు. అయితే ఆ అధికారిణి పేరు, ఇతర వివరాలను ఆయన వెల్లడించలేదు. డిసెంబరు 4న నౌకదళ దినోత్సవం జరగనున్న నేపథ్యంలో శుక్రవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. భారత నౌకాదళానికి చెందిన నౌకలు, జలాంతర్గాములు, విమానాలు వ్యూహాత్మక జలాల్లో అత్యధికస్థాయిలో అప్రమత్తతను కలిగి ఉన్నాయని చెప్పారు. హిందూ మహాసముద్రంలో చైనా కదలికలపై ప్రశ్నించగా.. ఆ ప్రాంతంలోని అన్ని కార్యకలాపాలను భారత నౌకాదళం నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని