10, 12 తరగతుల ఫలితాల్లో మార్కుల డివిజన్‌ ప్రకటించం: సీబీఎస్‌ఈ

పది, పన్నెండు తరగతుల పరీక్షల ఫలితాలకు సంబంధించి సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) కీలక ప్రకటన వెలువరించింది.

Published : 02 Dec 2023 04:06 IST

దిల్లీ: పది, పన్నెండు తరగతుల పరీక్షల ఫలితాలకు సంబంధించి సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) కీలక ప్రకటన వెలువరించింది. ఫలితాల్లో భాగంగా ఎటువంటి డివిజన్‌, డిస్టింక్షన్‌ ప్రకటించబోమని తేల్చిచెప్పింది. మార్కుల శాతాన్ని కూడా పేర్కొనబోమని స్పష్టంచేసింది. ‘‘ఫలితాల్లో భాగంగా ఎలాంటి సంపూర్ణ డివిజన్‌, డిస్టింక్షన్‌ లేదా మొత్తం మార్కులను ప్రకటించబోం. ఒకవేళ విద్యార్థి ఐదు కంటే ఎక్కువ సబ్జెక్టులను ప్రస్తావిస్తే.. వాటిలో ఐదు ఉత్తమ సబ్జెక్టులను గుర్తించడంపై సదరు ఇన్‌స్టిట్యూట్‌ లేదా నియామక సంస్థ నిర్ణయం తీసుకోవచ్చు’’ అని సీబీఎస్‌ఈ ఎగ్జామినేషన్‌ కంట్రోలర్‌ సన్యమ్‌ భరద్వాజ్‌ తెలిపారు. మార్కుల శాతాన్ని బోర్డు గణించబోదని, ప్రకటించబోదని స్పష్టంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని