అటువంటి సందర్భంలో పరిమిత బెయిల్‌ చట్టవిరుద్థమే: సుప్రీం కోర్టు

ఏదైనా కేసులో నిందితుడు బెయిల్‌ పొడిగింపు పొందడానికి అర్హుడుగా తేలిన సందర్భంలో అతనికి పరిమిత కాల బెయిల్‌ మంజూరు చేయడం చట్టవ్యతిరేకమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Updated : 04 Dec 2023 06:42 IST

దిల్లీ: ఏదైనా కేసులో నిందితుడు బెయిల్‌ పొడిగింపు పొందడానికి అర్హుడుగా తేలిన సందర్భంలో అతనికి పరిమిత కాల బెయిల్‌ మంజూరు చేయడం చట్టవ్యతిరేకమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అటువంటి ఆదేశాలు స్వేచ్ఛా హక్కు ఉల్లంఘనేనని పేర్కొంది. నార్కోటిక్‌ డ్రగ్స్‌, సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సస్‌ (ఎన్‌డీపీఎస్‌) చట్టం 1985 కింద అభియోగాలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తికి సంబంధించిన బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారించింది. ఆ సందర్భంగా.. ఆ తరహా ఆదేశాలు కక్షిదారుపై అదనపు భారం మోపుతాయని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. అటువంటి సందర్భాల్లో ఆ వ్యక్తి పూర్తిస్థాయి బెయిల్‌ కోసం తాజాగా దరఖాస్తు దాఖలు చేసుకోవలసిన పరిస్థితి ఎదురవుతుందని వ్యాఖ్యానించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని