గోపాల్‌ భార్గవ.. తొమ్మిదోసారి..

మధ్యప్రదేశ్‌లో భాజపా దిగ్గజ నేతల్లో ఒకరైన గోపాల్‌ భార్గవ (71) రహ్లీ నియోజకవర్గంపై తన పట్టును మరోసారి చాటుకున్నారు.

Updated : 04 Dec 2023 06:40 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో భాజపా దిగ్గజ నేతల్లో ఒకరైన గోపాల్‌ భార్గవ (71) రహ్లీ నియోజకవర్గంపై తన పట్టును మరోసారి చాటుకున్నారు. వరుసగా తొమ్మిదోసారి ఆయన విజయభేరి మోగించారు. ప్రస్తుత ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి జ్యోతి పటేల్‌ (కాంగ్రెస్‌)ను 72,800 ఓట్ల తేడాతో చిత్తు చేశారు. రహ్లీలో గోపాల్‌ భార్గవ తొలిసారి 1985లో గెలిచారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో ఆయనకు తిరుగే లేకుండా పోయింది. ఎప్పుడూ ఎన్నికల సమయంలో ప్రచారం నిర్వహించకపోవడం గోపాల్‌ ప్రత్యేకత. తాను నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తుంటానని.. అందుకే ప్రత్యేకంగా ప్రచారం అవసరం లేదని భావిస్తానని ఆయన చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని