రక్తదానంపై ప్రచారం చేస్తూ 17,700 కి.మీ. పాదయాత్ర

దిల్లీకి చెందిన కిరణ్‌వర్మ అనే సామాజిక కార్యకర్త రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గత రెండేళ్లలో దేశవ్యాప్తంగా 17,700 కిలోమీటర్లు తిరిగారు.

Published : 04 Dec 2023 05:45 IST

ఈటీవీ భారత్‌: దిల్లీకి చెందిన కిరణ్‌వర్మ అనే సామాజిక కార్యకర్త రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గత రెండేళ్లలో దేశవ్యాప్తంగా 17,700 కిలోమీటర్లు తిరిగారు. 2025 డిసెంబరు నెలాఖరుకు 21 వేల కి.మీ.ల పాదయాత్ర పూర్తి చేయాలన్నది ఆయన లక్ష్యం. 2021 డిసెంబరు 28న కేరళలోని తిరువనంతపురంలో ప్రారంభమైన కిరణ్‌వర్మ పాదయాత్ర ఇటీవల నాగాలాండ్‌లోని కోహిమా జిల్లాకు చేరుకుంది. ఇప్పటివరకు 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా 229 జిల్లాల్లో ఆయన నడిచారు. 50 లక్షలమంది కొత్త రక్తదాతలను ప్రోత్సహించడమే తన లక్ష్యమని చెబుతున్న కిరణ్‌వర్మకు మద్దతుగా దేశంలో 126 రక్తదాన శిబిరాలు నిర్వహించి 26,722 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. పాదయాత్ర పూర్తయ్యేనాటికి దేశంలో 10 కోట్ల మంది ప్రజలను కలుసుకుంటానని.. త్వరలో మణిపుర్‌, మిజోరం, త్రిపుర సహా ఈశాన్య ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు కిరణ్‌వర్మ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని