తుపాను ధాటికి చెన్నై విలవిల

మిగ్‌జాం తుపాను ధాటికి చెన్నై నగరం అతలాకుతలమైంది. ఆదివారం రాత్రి నుంచి కుండపోతగా వర్షం కురిసింది. చెన్నైలో గత 24 గంటల్లో 20 సెం.మీ. నుంచి 29 సెం.మీ. వరకు వర్షపాతం నమోదైంది.

Published : 05 Dec 2023 04:39 IST

ముంచెత్తిన వరద.. స్తంభించిన రవాణా వ్యవస్థ

ఈనాడు, చెన్నై: మిగ్‌జాం తుపాను ధాటికి చెన్నై నగరం అతలాకుతలమైంది. ఆదివారం రాత్రి నుంచి కుండపోతగా వర్షం కురిసింది. చెన్నైలో గత 24 గంటల్లో 20 సెం.మీ. నుంచి 29 సెం.మీ. వరకు వర్షపాతం నమోదైంది. దీంతో రోడ్డు, రైలు, జల, వాయుమార్గాల్లో సోమవారం రవాణా సేవలు స్తంభించాయి. వరద ఉద్ధృతి పెరగడంతో రాత్రి 11 గంటల వరకు మీనంబాక్కం విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. 70కిపైగా విమానాలు రద్దవ్వగా, మరో 33 సర్వీసులను బెంగళూరుకు దారి మళ్లించారు. కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లోనూ తుపాను ప్రభావం ఎక్కువగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని