రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత ఉచిత వైద్యం!

దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత వైద్య చికిత్సను అందుబాటులోకి తెచ్చే ప్రణాళికపై కేంద్రం కసరత్తు చేస్తోంది.

Updated : 05 Dec 2023 07:41 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత వైద్య చికిత్సను అందుబాటులోకి తెచ్చే ప్రణాళికపై కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ విషయాన్ని సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర రహదారి, రవాణా మంత్రిత్వశాఖ కార్యదర్శి అనురాగ్‌ జైన్‌ తెలిపారు.‘‘రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత, నగదు రహిత వైద్య చికిత్స అందించాలని సవరించిన మోటార్‌ వెహికల్‌ చట్టం-2019లో ఉంది. కొన్ని రాష్ట్రాలు అమలు చేశాయి. ఇప్పుడు కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ మంత్రిత్వశాఖతో కలిసి మేం దేశవ్యాప్తంగా మరో మూడు, నాలుగు నెలల్లో అమలు చేయడానికి కసరత్తు చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు