నిర్ణయం తీసుకునే ముందే చర్చించాలి

టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై నైతిక విలువల కమిటీ ఇచ్చిన నివేదికపై లోక్‌సభలో చర్చించిన తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండు చేశాయి.

Published : 05 Dec 2023 04:13 IST

మొయిత్రా అంశంపై విపక్షాల డిమాండ్‌

దిల్లీ: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై నైతిక విలువల కమిటీ ఇచ్చిన నివేదికపై లోక్‌సభలో చర్చించిన తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండు చేశాయి. సోమవారం స్పీకర్‌ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన సభావ్యవహారాల సలహా సంఘం సమావేశంలో ఈ అంశాన్ని విపక్షాలు లేవనెత్తాయి. కమిటీ నివేదిక మ్యాచ్‌ ఫిక్సింగ్‌ లాంటిదని, ఫిర్యాదు చేసిన భాజపా ఎంపీ ఎటువంటి ఆధారాలను సమర్పించలేదని తెలిపాయి. మరోవైపు ఈ నివేదిక మంగళవారం సభ ముందుకు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. దానిపై చర్చించి ఓటింగ్‌ జరిగి ఆమోదం లభిస్తే మొయిత్రాపై అనర్హత వేటు పడుతుంది. వాస్తవానికి నివేదికను సోమవారం జాబితాలోనే చేర్చారు. అయితే ప్రిసైడింగ్‌ అధికారి దానిని పరిగణనలోకి తీసుకోలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని