హైకోర్టు జడ్జీల బదిలీలపై కొత్త విధానానికి సిద్ధమే

హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలకు కొత్త విధానాన్ని తీసుకొచ్చే విషయంలో ప్రభుత్వం సుముఖంగానే ఉందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ తెలిపారు. న్యాయవాద వృత్తి నియంత్రణ బిల్లుపై సోమవారం లోక్‌సభలో జరిగిన చర్చలో మంత్రి పాల్గొన్నారు.

Published : 05 Dec 2023 04:30 IST

కేంద్ర న్యాయశాఖ మంత్రి వెల్లడి

దిల్లీ: హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలకు కొత్త విధానాన్ని తీసుకొచ్చే విషయంలో ప్రభుత్వం సుముఖంగానే ఉందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ తెలిపారు. న్యాయవాద వృత్తి నియంత్రణ బిల్లుపై సోమవారం లోక్‌సభలో జరిగిన చర్చలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్జీల బదిలీల విషయాన్ని టీఎంసీ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ ప్రస్తావించగా మంత్రి స్పందించారు. కొలీజియం వ్యవస్థ 1993లో మనుగడలోకి వచ్చినప్పటి నుంచి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల ప్రకారమే జడ్జీల బదిలీలు, నియామకాలు జరుగుతున్నాయని మేఘ్వాల్‌ వివరించారు. జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌ (ఎన్‌జేఏసీ) బిల్లును పార్లమెంటు ఆమోదించినప్పటికీ తనకున్న న్యాయ సమీక్ష అధికారం ద్వారా సుప్రీంకోర్టు దానిని కొట్టి చేసిందని గుర్తు చేశారు. జడ్జీల బదిలీలకు ఒక విధానం ఉండటం మంచిదేనని, దానిని తాము సమర్థిస్తున్నామని మంత్రి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని