ఐఐటీ కాన్పుర్‌లో కొలువుల జోష్‌..

ఐఐటీ-కాన్పుర్‌లో కొలువుల సందడి మొదలైంది. తొలి రోజు పలు ప్రఖ్యాత కంపెనీలు నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో 485 మంది విద్యార్థులు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌, ప్రీ-ప్లేస్‌మెంట్‌ ఆఫర్లు(పీపీవో) అందుకున్నారు.

Published : 05 Dec 2023 04:33 IST

ఒకేరోజు 485 మందికి జాబ్‌ ఆఫర్లు

కాన్పుర్‌: ఐఐటీ-కాన్పుర్‌లో కొలువుల సందడి మొదలైంది. తొలి రోజు పలు ప్రఖ్యాత కంపెనీలు నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో 485 మంది విద్యార్థులు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌, ప్రీ-ప్లేస్‌మెంట్‌ ఆఫర్లు(పీపీవో) అందుకున్నారు. మరో 12 మంది విద్యార్థులు అంతర్జాతీయ ఉద్యోగ ఆఫర్లను దక్కించుకున్నారు. కాన్పుర్‌ ఐఐటీలో 2023-24 ఏడాదికి గాను మైక్రోసాఫ్ట్‌, నావి, టెక్సాస్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌, క్వాల్కమ్‌, డాయిష్‌ బ్యాంక్‌ సంస్థలు టాప్‌ నియామక సంస్థలుగా నిలిచాయి. 216 మంది విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ కంపెనీల్లో ప్రీ ప్లేస్‌మెంట్‌ ఆఫర్లు (పీపీఓ) అందుకున్నట్లు విద్యాసంస్థ యాజమాన్యం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని