లారీని ఢీకొని పట్టాలు తప్పిన రైలింజన్‌

పశ్చిమబెంగాల్‌లోని ముర్షిదాబాద్‌ జిల్లాలో సోమవారం ఓ రైలు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక లెవెల్‌ క్రాసింగ్‌ వద్ద పట్టాలపైకి వచ్చిన ఓ లారీని రాధికాపుర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. దీంతో దాని ఇంజిన్‌ పట్టాలు తప్పి అగ్నికీలల్లో చిక్కుకుంది.

Published : 05 Dec 2023 04:38 IST

పశ్చిమబెంగాల్‌లో ఘటన

కోలకతా: పశ్చిమబెంగాల్‌లోని ముర్షిదాబాద్‌ జిల్లాలో సోమవారం ఓ రైలు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక లెవెల్‌ క్రాసింగ్‌ వద్ద పట్టాలపైకి వచ్చిన ఓ లారీని రాధికాపుర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. దీంతో దాని ఇంజిన్‌ పట్టాలు తప్పి అగ్నికీలల్లో చిక్కుకుంది. వెంటనే దానిని మిగతా రైలు నుంచి వేరు చేశారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించినట్లు సమాచారం లేదు. తూర్పురైల్వేలోని మాల్దా డివిజన్‌లో ధులియాన్‌ గంగా, బల్లాపుర్‌ స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం చోటు చేసుకుందని రైల్వే అధికారులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని