ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ.. రోగులకు సేవ

కేరళలోని కన్నూర్‌ జిల్లా బక్కళం ప్రాంతానికి చెందిన శోభన.. క్యాన్సర్‌, ఇతర వ్యాధులతో బాధపడుతూ మంచాన పడిన నిరుపేద రోగుల సేవలో తరిస్తున్నారు. క్యాన్సర్‌ బారినపడిన తన సోదరుడి భార్య అవస్థలను శోభన కళ్లారా చూశారు.

Updated : 05 Dec 2023 07:02 IST

కేరళలోని కన్నూర్‌ జిల్లా బక్కళం ప్రాంతానికి చెందిన శోభన.. క్యాన్సర్‌, ఇతర వ్యాధులతో బాధపడుతూ మంచాన పడిన నిరుపేద రోగుల సేవలో తరిస్తున్నారు. క్యాన్సర్‌ బారినపడిన తన సోదరుడి భార్య అవస్థలను శోభన కళ్లారా చూశారు. ఆమె మరణించడంతో  రోగులకు సేవ చేసేందుకు పూర్తి సమయం వెచ్చించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం పదేళ్లుగా చేస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగానికి సైతం రాజీనామా చేశారు. ప్రస్తుతం సంజీవని పాలియేటివ్‌ కేర్‌ సహకారంతో అంబులెన్స్‌లో రోజూ రోగుల ఇంటికి వెళ్లి శోభన సేవలు చేస్తున్నారు. అవసరమైన ఔషధాలు అందజేస్తున్నారు. ఇలా సుమారు 150 కిలోమీటర్లు ప్రయాణించి రోజూ 25 మంది నుంచి 30 మంది రోగులకు సాంత్వన చేకూర్చుతున్నారు. ఉచిత సేవ కోసం వివిధ దుకాణాల్లో ఏర్పాటుచేసిన కాయిన్‌ బాక్సుల ద్వారా శోభన విరాళాలు సేకరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని