ఈసారి వేడి శీతాకాలం!

ఈ శీతాకాలంలో ప్రపంచ సరాసరి ఉపరితల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో ఎక్కువగా నమోదు కావొచ్చని చైనా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Published : 06 Dec 2023 04:08 IST

సాధారణం కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు

దిల్లీ: ఈ శీతాకాలంలో ప్రపంచ సరాసరి ఉపరితల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో ఎక్కువగా నమోదు కావొచ్చని చైనా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇందుకు అవకాశం 95 శాతం మేర ఉందని వివరించారు. యూరేసియాలోని కొన్ని ప్రాంతాలు, ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల్లో చాలాచోట్ల అసాధారణ స్థాయిలో వేడి ఉష్ణోగ్రతలు ఉండొచ్చని తెలిపారు. ఉత్తరార్ధగోళంలో రానున్న శీతాకాలంలో తూర్పు పసిఫిక్‌ మహాసముద్రంలో ఎల్‌నినో మరింత బలపడే అవకాశం ఉందని, దాని వల్లే ఈ పరిస్థితి తలెత్తుతుందని వివరించారు. బలమైన ఎల్‌నినో.. వాయవ్య పసిఫిక్‌లో ప్రతికూలమైన యాంటీ సైక్లోన్‌ చర్యను ప్రేరేపిస్తుందని తెలిపారు. ఇది పలుచోట్ల శీతాకాలంలో ఉష్ణోగ్రతల పెరుగుదలకు దారితీస్తుందని వివరించారు. ఈ దఫా చైనాలో ఉపరితల ఉష్ణోగ్రతలు.. సాధారణం కన్నా రెట్టింపు స్థాయిలో ఉండొచ్చని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని