సురక్షిత నగరం కోల్‌కతా

దేశంలో సురక్షిత నగరంగా పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతా వరుసగా మూడోసారి మొదటిస్థానంలో నిలిచింది.

Updated : 06 Dec 2023 06:05 IST

2, 3 స్థానాల్లో పుణె, హైదరాబాద్‌

కోల్‌కతా: దేశంలో సురక్షిత నగరంగా పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతా వరుసగా మూడోసారి మొదటిస్థానంలో నిలిచింది. జాతీయ నేర గణాంకాల నమోదు సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ప్రకారం.. 2022లో ప్రతి లక్ష మంది జనాభాకు కనిష్ఠ సంఖ్యలో గుర్తించదగిన నేరాలు నమోదైన నగరాల్లో 86.5 కేసులతో కోల్‌కతా ప్రథమస్థానం సాధించింది. తర్వాత స్థానాల్లో పుణె (280.7), హైదరాబాద్‌ (299.2) నగరాలు ఉన్నాయి. 2021లో గుర్తించదగిన నేరాల సంఖ్య ప్రతి లక్ష జనాభాకు కోల్‌కతాలో 103.4, పుణెలో 256.8, హైదరాబాద్‌లో 259.9గా నమోదైంది. 20 లక్షలకు పైగా జనాభా ఉన్న 19 మెట్రోపాలిటన్‌ నగరాల్లోని సమాచారంతో ఎన్‌సీఆర్‌బీ ఈ ర్యాంకులను ప్రకటించింది. మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర ఏజెన్సీల వివరాలతో ‘క్రైం ఇన్‌ ఇండియా 2022’ పేరిట ఎన్‌సీఆర్‌బీ ఈ నివేదికను విడుదల చేసింది.

2022లో అత్యంత ఎక్కువ అల్లర్లు చోటుచేసుకున్న రాష్ట్రంగా మహారాష్ట్ర తొలిస్థానంలో (8,218 కేసులు)  ఉంది. ఆ తర్వాత బిహార్‌లో 4,736, యూపీలో 4,478 అల్లర్ల కేసులు నమోదయ్యాయి. గతేడాది యూపీలో అత్యధికంగా 3,491 హత్య కేసులు నమోదయ్యాయి. బిహార్‌లో 2,930, మహారాష్ట్రలో 2,295 హత్యలు జరిగాయి. 2022లో రాజస్థాన్‌లో అత్యధికంగా 5,399 అత్యాచార కేసులు నమోదయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని