లారెన్స్‌ బిష్ణోయ్‌ ముఠా లక్ష్యంగా ఈడీ దాడులు

గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ ముఠా మనీలాండరింగ్‌ నెట్‌వర్క్‌ లక్ష్యంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాడులు మొదలయ్యాయి.

Published : 06 Dec 2023 04:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ ముఠా మనీలాండరింగ్‌ నెట్‌వర్క్‌ లక్ష్యంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాడులు మొదలయ్యాయి. రాజస్థాన్‌, హరియాణాల్లో ఈ ముఠాపై నమోదైన కేసుల దర్యాప్తులో భాగంగా ఈ రెండు రాష్ట్రాల్లోని దాదాపు డజనుకుపైగా ప్రాంగణాల్లో ఈడీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కొన్నాళ్ల క్రితం లారెన్స్‌ బిష్ణోయ్‌, అతడి సహచరుడు గోల్డీ బ్రార్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ప్రస్తుతం లారెన్స్‌ బిష్ణోయ్‌ జైల్లో ఉన్నాడు. ఇతడి ముఠా దేశంలో పెద్ద మొత్తంలో బలవంతపు వసూళ్లకు, మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాకు పాల్పడుతోంది. తద్వారా సంపాదించిన సొమ్మును కెనడా తదితర దేశాలకు తరలిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని