సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో దిల్లీ వర్సిటీ భేష్‌

పర్యావరణ విద్య, వాతావరణ మార్పుల వంటి విషయాల్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన కోసం కృషి చేస్తున్న దిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.

Published : 06 Dec 2023 04:58 IST

దిల్లీ: పర్యావరణ విద్య, వాతావరణ మార్పుల వంటి విషయాల్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన కోసం కృషి చేస్తున్న దిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. మన దేశంలో ఇలాంటి కృషి చేస్తున్న 56 వర్సిటీలను క్యూఎస్‌ వరల్డ్‌ గుర్తించింది. వాటికి ర్యాంకులను ఇచ్చింది. ఆ వివరాలను మంగళవారం దిల్లీలో విడుదల చేసింది. ఇందులో డీయూ అగ్రస్థానం దక్కించుకుంది. బొంబాయి ఐఐటీ రెండో స్థానంలో నిలిచింది. మద్రాస్‌ ఐఐటీకి మూడో స్థానం దక్కింది. ఈ ర్యాంకుల్లో ప్రపంచంలో మొదటి స్థానం యూనివర్సిటీ ఆఫ్‌ టొరంటో దక్కించుకుంది. బర్కిలీ రెండో స్థానంలో, ద యూనివర్సిటీ ఆఫ్‌ మాంచెస్టర్‌ మూడో స్థానంలో నిలిచాయి. 95 దేశాల్లోని 1,397 వర్సిటీలకు ఈ ర్యాంకులను క్యూఎస్‌ వరల్డ్‌ ఇచ్చింది. వర్సిటీలకు ర్యాంకులిచ్చే విషయంలో మూడు విషయాలను క్యూఎస్‌ వరల్డ్‌ పరిగణనలోకి తీసుకుంది. పర్యావరణ ప్రభావం, సామాజిక ప్రభావం, పాలన తీరులను పరిశీలించింది. ప్రపంచంలోని టాప్‌ 100 వర్సిటీల్లో మన దేశం నుంచి నాలుగు చోటు దక్కించుకున్నాయి. అందులో వెల్లూర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (విట్‌) ఒకటి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని