రూ.113 కోట్ల అనుమానాస్పద చెల్లింపులు నిలిపివేశాం

ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య బీమా కింద కోరిన క్లెయిమ్‌లలో అనుమానాస్పదంగా ఉన్న రూ.113 కోట్ల విలువైన క్లెయిమ్‌లను విచారణ పూర్తయ్యేవరకు నిలిపివేసినట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాజ్యసభకు తెలిపింది.

Published : 06 Dec 2023 04:59 IST

ఆయుష్మాన్‌ భారత్‌ అక్రమాలపై రాజ్యసభకు తెలిపిన కేంద్రం

దిల్లీ: ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య బీమా కింద కోరిన క్లెయిమ్‌లలో అనుమానాస్పదంగా ఉన్న రూ.113 కోట్ల విలువైన క్లెయిమ్‌లను విచారణ పూర్తయ్యేవరకు నిలిపివేసినట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాజ్యసభకు తెలిపింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్‌ బఘేల్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ పథకం కింద నమోదైన ఆసుపత్రుల జాబితా నుంచి 900కుపైగా వైద్యశాలలను తొలగించామన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన (ఏబీ-పీఎంజేఏవై) పథకంలో అవకతవకలపై కాగ్‌ ఇచ్చిన నివేదిక, అవకతవకలను సరిచేసేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు బదులిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని