సంక్షిప్త వార్తలు

చంద్రుడి కక్ష్యలో తిరుగుతున్న చంద్రయాన్‌-3 ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ను తిరిగి భూకక్ష్యలోకి విజయవంతంగా తీసుకువచ్చిన ఇస్రోకు అభినందనలు.

Updated : 07 Dec 2023 06:08 IST

ఇస్రోకు అభినందనలు

చంద్రుడి కక్ష్యలో తిరుగుతున్న చంద్రయాన్‌-3 ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ను తిరిగి భూకక్ష్యలోకి విజయవంతంగా తీసుకువచ్చిన ఇస్రోకు అభినందనలు. 2040 నాటికి భారతీయుడిని చంద్రుడిపైకి పంపాలనే లక్ష్యంతోపాటు భవిష్యత్తులో చేపట్టబోయే అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి ఇస్రో మరో కీలక సాంకేతిక మైలురాయిని అధిగమించింది.

నరేంద్ర మోదీ


గర్బా.. దేశానికి గర్వకారణం

గుజరాత్‌ సంప్రదాయ నృత్యం గర్బా ప్రతిష్ఠాత్మక యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో చోటు దక్కించుకోవడం దేశానికి గర్వకారణం. ప్రధాని మోదీ అంతర్జాతీయ వేదికలపై భారతీయ ఘన సంస్కృతికి ప్రాచుర్యం కల్పించడానికి విశేష కృషి చేస్తున్నారు. తాజాగా గర్బాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు దక్కడమే అందుకు తిరుగులేని నిదర్శనం.

పీయూష్‌ గోయల్‌


సంపన్న దేశాల్లో పెరుగుతున్న పేదరికం

ప్రపంచంలోని 40 సంపన్న దేశాల్లో ప్రతి అయిదుగురు పిల్లల్లో ఒకరి కన్నా ఎక్కువ మంది పేదరికంలో జీవిస్తున్నారు. ఏళ్ల తరబడి స్థిరమైన ఆర్థిక వృద్ధి ఉన్నప్పటికీ, కొన్ని సంపన్న దేశాల్లో 2014-21 మధ్య పేదరికంలోకి జారిన పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ పరిస్థితిని రూపుమాపడానికి ఆయా ప్రభుత్వాలు పటిష్ఠ చర్యలు చేపట్టాలి.

యునిసెఫ్‌


వారి సాంగత్యంతోనే ఆనందం

మన దగ్గర ఎన్నో విలువైన వస్తువులు ఉండొచ్చు. కానీ మనకు జీవితంలో ఆనందాన్నిచ్చేది ప్రియమైన వారి సాంగత్యమే. వారు మీకు ఎంత ప్రత్యేకమో వారికి తెలియజేయండి. వారితో సాధ్యమైనంత ఎక్కువ సేపు గడపడానికి సమయాన్ని కేటాయించుకోండి. ఆ జ్ఞాపకాలే భవిష్యత్తులో మధురానుభూతులుగా మిగులుతాయి.

గౌర్‌ గోపాల్‌ దాస్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని