ఒక్క ఘటనతో గృహ హింసను నిర్ధారించలేం

ఒకే ఒక్క ఘటన ఆధారంగా...అదీ అంత తీవ్రమైనది కాని పక్షంలో నిందితునిపై గృహ హింస నేరాన్ని మోపలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Published : 07 Dec 2023 06:03 IST

సుప్రీంకోర్టు స్పష్టీకరణ

దిల్లీ: ఒకే ఒక్క ఘటన ఆధారంగా...అదీ అంత తీవ్రమైనది కాని పక్షంలో నిందితునిపై గృహ హింస నేరాన్ని మోపలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తన వైవాహిక జీవితంలో జోక్యం చేసుకుంటున్నారంటూ ఫిర్యాదుదారైన మహిళ చేసిన ఆరోణలకూ బలమైన సాక్ష్యాలు ఉండాలనీ పేర్కొంది. ఓ వివాహిత తన భర్త, అతని సోదరి, మరో ఇద్దరు బంధువులపై ఐపీసీ సెక్షన్లు 498ఎ, 506, వరకట్న నిషేధ చట్టం కింద మోపిన నేరాభియోగాలను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఫిర్యాదుదారు చేసిన ఆరోపణలు చాలా సాధారణంగా, నమ్మశక్యంగాని విధంగా ఉన్నాయని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్‌.వి.ఎన్‌.భట్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. తమపై మోపిన అభియోగాలను కర్ణాటక హైకోర్టు కొట్టివేయడానికి నిరాకరించగా దానిని సవాల్‌ చేస్తూ నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని