యునెస్కో జాబితాలో గర్బా నృత్యం

గుజరాత్‌ సంప్రదాయ నృత్యం గర్బాకు ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ (యునెస్కో) గుర్తింపు లభించింది.

Published : 07 Dec 2023 05:28 IST

హర్షం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ

అహ్మదాబాద్‌: గుజరాత్‌ సంప్రదాయ నృత్యం గర్బాకు ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ (యునెస్కో) గుర్తింపు లభించింది. ఈ విషయాన్ని బుధవారం గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌ తెలిపారు. గర్బాను.. మానవత్వ సాంస్కృతిక వారసత్వ ప్రాతినిధ్య జాబితాలో యునెస్కో చేర్చినట్లు ప్రకటించారు. ఇది గుజరాత్‌ ప్రజలకు గర్వకారణమని పేర్కొన్నారు. గర్బా నృత్యం యునెస్కో జాబితాలో చేరడంపై ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేశారు. భారత సంస్కృతిని ప్రపంచానికి చూపేందుకు ఇది గొప్ప అవకాశమని అన్నారు. మన వారసత్వాన్ని భవిష్యత్తు తరాల కోసం సంరక్షించడానికి ఈ గౌరవం స్ఫూర్తినిస్తుందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని