బీరువాల నిండా నోట్ల కట్టలే

ఆదాయపు పన్ను ఎగవేస్తున్న మద్యం వ్యాపారుల ఇళ్లపై ఇన్‌కం ట్యాక్స్‌ అధికారులు రెండు రోజులుగా దాడులు చేస్తున్నారు.

Updated : 08 Dec 2023 09:40 IST

ఒడిశాలో మద్యం వ్యాపారుల ఇళ్లలో ఐటీ దాడులు
రూ.510 కోట్లు స్వాధీనం

రాయగడ పట్టణం, కటక్‌, న్యూస్‌టుడే: ఆదాయపు పన్ను ఎగవేస్తున్న మద్యం వ్యాపారుల ఇళ్లపై ఇన్‌కం ట్యాక్స్‌ అధికారులు రెండు రోజులుగా దాడులు చేస్తున్నారు. ఒడిశాలోని రాయగడ గాంధీనగర్‌లో నివాసముంటున్న మద్యం వ్యాపారి అరవింద్‌ సాహు ఇల్లు, కార్యాలయాల్లో బుధ, గురువారాల్లో సోదాలు నిర్వహించారు. అయితే అక్కడ ఎంత నగదు దొరికిందో అధికారుల వెల్లడించలేదు. భువనేశ్వర్‌, సుందర్‌గఢ్‌, బౌద్ధ్‌ జిల్లాలతోపాటు టిట్లాగఢ్‌లోనూ పలువురు మద్యం వ్యాపారుల నివాసాల్లో సోదాలు నిర్వహించారు. టిట్లాగఢ్‌ పట్టణంలో ఉంటున్న దీపక్‌ సాహు, సంజయ్‌ సాహు, రాకేశ్‌ సాహుల ఇళ్లలో రెండురోజుల తనిఖీల్లో రూ.510 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. బీరువాల నిండా పేర్చి ఉన్న నోట్లకట్టలు చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. డబ్బును బుధవారం రాత్రి బొలంగీర్‌ ఎస్‌బీఐ శాఖకు తరలించారు. రాష్ట్రంలో 20 ప్రాంతాలతోపాటు ఝార్ఖండ్‌, కోల్‌కతాల్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని