మెఫ్తాల్‌ వినియోగంతో దుష్ప్రభావాల ముప్పు!

కీళ్లవాతం, నెలసరి నొప్పిని తప్పించుకునేందుకు ప్రజలు అధికంగా వినియోగించే మెఫ్తాల్‌ ఔషధం కొన్ని దుష్ప్రభావాలకూ కారణమయ్యే ముప్పు లేకపోలేదని భారత ఔషధప్రబంధ కమిషన్‌ (ఐపీసీ) హెచ్చరించింది!

Published : 08 Dec 2023 05:05 IST

దిల్లీ: కీళ్లవాతం, నెలసరి నొప్పిని తప్పించుకునేందుకు ప్రజలు అధికంగా వినియోగించే మెఫ్తాల్‌ ఔషధం కొన్ని దుష్ప్రభావాలకూ కారణమయ్యే ముప్పు లేకపోలేదని భారత ఔషధప్రబంధ కమిషన్‌ (ఐపీసీ) హెచ్చరించింది! ఈ నొప్పి నివారణ ఔషధం కొన్నిసార్లు ఇసినోఫీలియా అండ్‌ సిస్టెమిక్‌ సింప్టమ్స్‌ (డ్రెస్‌) సిండ్రోమ్‌కు దారితీస్తున్నట్లు ‘ఫార్మకోవిజిలెన్స్‌ ప్రోగ్రామ్‌ ఆఫ్‌ ఇండియా (పీవీపీఐ)’ ప్రాథమిక పరిశీలనలో తేలిందంటూ అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో దాన్ని వినియోగించినప్పుడు ఏవైనా దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయా అనే విషయాన్ని ఆరోగ్యరంగ నిపుణులు, మెఫ్తాల్‌ వినియోగదారులు నిశితంగా గమనించాలని.. సమస్యేదైనా ఉంటే వెంటనే పీవీపీఐ జాతీయ సమన్వయ కేంద్రానికి ఫిర్యాదు చేయాలని కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని