ఖతార్‌లో మరణశిక్ష పడిన బాధితులతో భారత రాయబారి భేటీ

గూఢచర్యం ఆరోపణలపై ఖతార్‌లో మరణశిక్షను ఎదుర్కొంటున్న భారత్‌కు చెందిన ఎనిమిది మంది నౌకాదళ మాజీ సిబ్బందిని ఈ నెల మూడున ఖతార్‌లోని భారత రాయబారి కలిశారు.

Published : 08 Dec 2023 05:05 IST

దిల్లీ: గూఢచర్యం ఆరోపణలపై ఖతార్‌లో మరణశిక్షను ఎదుర్కొంటున్న భారత్‌కు చెందిన ఎనిమిది మంది నౌకాదళ మాజీ సిబ్బందిని ఈ నెల మూడున ఖతార్‌లోని భారత రాయబారి కలిశారు. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి గురువారం మీడియాకు వెల్లడించారు. ఈ మరణశిక్ష తీర్పును సవాలు చేస్తూ ఖతార్‌ కోర్టులో భారత ప్రభుత్వం అప్పీల్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. ‘ఈ కేసులో ఇప్పటివరకు రెండుసార్లు విచారణ జరిగింది. మేం ఈ అంశాన్ని నిశితంగా గమనిస్తున్నాం. ఇది చాలా సున్నితమైన అంశం. బాధితులకు న్యాయపరమైన, దౌత్యపరమైన సహకారం కొనసాగుతుంది. డిసెంబర్‌ మూడున మన రాయబారి వారిని కలిశారు’ అని బాగ్చి వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని