చైనా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు భారత్‌లో లేవు : కేంద్రం

ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు దాకా ఆర్నెల్ల కాలంలో దిల్లీలోని ఎయిమ్స్‌లో ఏడు బ్యాక్టీరియా కేసులను గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

Published : 08 Dec 2023 05:06 IST

దిల్లీ: ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు దాకా ఆర్నెల్ల కాలంలో దిల్లీలోని ఎయిమ్స్‌లో ఏడు బ్యాక్టీరియా కేసులను గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇది నిరంతర అధ్యయనంలో భాగమని, ఇందులో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. చైనాతోపాటు ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో వెలుగుచూసిన చిన్నపిల్లల శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో వీటికి సంబంధం ఉన్నట్లు జాతీయ మీడియాలో వచ్చిన కథనాలు వాస్తవం కాదని, అవి ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నట్లు పేర్కొంది. భారతీయ వైద్య పరిశోధనల మండలి పరిశీలనలో భాగంగా ఈ ఏడాది దిల్లీ ఎయిమ్స్‌ మైక్రోబయాలజీ విభాగం చేపట్టిన 611 నమూనాల తనిఖీలో మైకోప్లాస్మా నిమోనియాను ఎక్కడా గుర్తించలేదని అధికారులు స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని