అర్జున్‌ ముండాకు వ్యవసాయశాఖ అదనపు బాధ్యతలు

కేంద్ర మంత్రి పదవులకు నరేంద్రసింగ్‌ తోమర్‌, ప్రహ్లాద్‌సింగ్‌ పటేల్‌, రేణుకాసింగ్‌ సమర్పించిన రాజీనామాలను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం ఆమోదించారు.

Published : 08 Dec 2023 05:08 IST

ముగ్గురు కేంద్ర మంత్రుల రాజీనామాలకు రాష్ట్రపతి ఆమోదం

దిల్లీ: కేంద్ర మంత్రి పదవులకు నరేంద్రసింగ్‌ తోమర్‌, ప్రహ్లాద్‌సింగ్‌ పటేల్‌, రేణుకాసింగ్‌ సమర్పించిన రాజీనామాలను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం ఆమోదించారు. అనంతరం ప్రధాని మోదీ సలహా మేరకు గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్‌ ముండాకు వ్యవసాయ శాఖ, రైతు సంక్షేమ శాఖల అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎలక్ట్రానిక్స్‌, సమాచార సాంకేతిక శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌కు జల్‌శక్తి శాఖ సహాయ మంత్రిగా అదనపు బాధ్యతలను కట్టబెట్టారు. వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభా కరందలాజేకు ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా.. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ భారతీ ప్రవీణ్‌ పవార్‌కు గిరిజన వ్యవహారాల సహాయ మంత్రిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రపతి భవన్‌ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని