9 మంది ఎంపీల రాజీనామాలకు లోక్‌సభ స్పీకర్‌ ఆమోదం

ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన 9 మంది ఎంపీలు తమ పార్లమెంటు సభ్యత్వాలకు చేసిన రాజీనామాలను లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా గురువారం ఆమోదించారు.

Published : 08 Dec 2023 05:09 IST

దిల్లీ: ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన 9 మంది ఎంపీలు తమ పార్లమెంటు సభ్యత్వాలకు చేసిన రాజీనామాలను లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా గురువారం ఆమోదించారు. వీటిలో కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్‌ తోమర్‌, ప్రహ్లాద్‌ పటేల్‌ రాజీనామాలు కూడా ఉన్నాయి. రాకేశ్‌ సింగ్‌, ప్రతాప్‌ సింగ్‌, రితి పాఠక్‌(మధ్యప్రదేశ్‌), దియా కుమారి, రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాఠోడ్‌(రాజస్థాన్‌), గోమతి సాయి, అరుణ్‌ సావో(ఛత్తీస్‌గఢ్‌) కూడా లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. వీరందరూ భాజపా ఎంపీలు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని