తెలుగు సహా పది భాషల్లో కేశవానంద భారతి తీర్పు

‘రాజ్యాంగ మౌలిక స్వరూపం’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన చరిత్రాత్మక కేశవానంద భారతి కేసు తీర్పును సుప్రీంకోర్టు తెలుగు సహా పది భాషల్లోకి తర్జుమా చేసింది.

Published : 08 Dec 2023 05:10 IST

దిల్లీ: ‘రాజ్యాంగ మౌలిక స్వరూపం’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన చరిత్రాత్మక కేశవానంద భారతి కేసు తీర్పును సుప్రీంకోర్టు తెలుగు సహా పది భాషల్లోకి తర్జుమా చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చింది. ఈ విషయాన్ని గురువారం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ వెల్లడించారు. ‘కేశవానంద భారతి ట్రస్టు వర్సెస్‌ కేరళ స్టేట్‌’ మధ్య జరిగిన ఈ కేసులో 13 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 1973లో తీర్పు వెలువరించింది. ఇందులో రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే హక్కు పార్లమెంటుకు లేదని ధర్మాసనం తీర్మానించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని