తనపై వీడియో క్లిప్‌ రావడంపై ఉప రాష్ట్రపతి ధన్‌ఖడ్‌ ఆవేదన

ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ గురువారం రాజ్యసభలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి అభివాదం చేసే సమయంలో ఆయన చేతులు జోడించి, శరీరాన్ని ముందుకు వంచిన భంగిమను పరిహసించే రీతిలో ఓ వీడియో బుధవారం సామాజిక మాధ్యమంలో ప్రచారంలోకి వచ్చింది.

Updated : 08 Dec 2023 06:06 IST

దిల్లీ: ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ గురువారం రాజ్యసభలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి అభివాదం చేసే సమయంలో ఆయన చేతులు జోడించి, శరీరాన్ని ముందుకు వంచిన భంగిమను పరిహసించే రీతిలో ఓ వీడియో బుధవారం సామాజిక మాధ్యమంలో ప్రచారంలోకి వచ్చింది. ఇది తన దృష్టికి రావడంతో రాజ్యసభ ఛైర్మన్‌ ధన్‌ఖడ్‌ గురువారం సభలో ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులకు వినమ్రంగా అభివాదం చేయడం మర్యాద అని, ఏ వ్యక్తికైనా తాను సంస్కారవంతంగా నమస్కరిస్తుంటానని, అది తన అలవాటని తెలిపారు. వినమ్రంగా ఉండటాన్ని పరిహాసం చేయడం తగదని ఓ పార్టీ సోషల్‌ మీడియా హ్యాండిల్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. ఇకపై ఇటువంటి విషయాల్లో మరింత అప్రమత్తంగా ఉంటానని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని