మోదీ చిత్రంతో విద్యార్థుల సెల్ఫీలు తప్పనిసరేమీ కాదు

ప్రధాని మోదీ చిత్రంతో విద్యార్థులు సెల్ఫీ దిగేందుకు వీలుగా కళాశాలల్లో ఒక సెల్ఫీ పాయింట్‌ను ఏర్పాటు చేయాలన్న ఆదేశాలను కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సమర్థించుకున్నారు.

Published : 08 Dec 2023 05:58 IST

కేంద్ర విద్యాశాఖ మంత్రి

దిల్లీ: ప్రధాని మోదీ చిత్రంతో విద్యార్థులు సెల్ఫీ దిగేందుకు వీలుగా కళాశాలల్లో ఒక సెల్ఫీ పాయింట్‌ను ఏర్పాటు చేయాలన్న ఆదేశాలను కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సమర్థించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు గర్వపడేలా ప్రధాని మోదీ కృషి చేశారని, దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారని తెలిపారు. సెల్ఫీపాయింట్‌ వద్ద మోదీ చిత్రంతో విద్యార్థులు ఫొటో దిగాలన్నది తప్పనిసరి ఆదేశమేమీ కాదన్నారు. సెల్ఫీ కావాలనుకున్న వారు అక్కడ ఫొటో దిగుతారని గురువారం లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని