దుష్యంత్‌ దవే లేఖపై ఎస్‌సీబీఏ అధ్యక్షుడి దిగ్భ్రాంతి

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌కు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే బహిరంగ లేఖ రాయడంపై సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ (ఎస్‌సీబీఏ) అధ్యక్షుడు ఆదిశ్‌ సి అగ్రవాల్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Updated : 08 Dec 2023 06:16 IST

దిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌కు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే బహిరంగ లేఖ రాయడంపై సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ (ఎస్‌సీబీఏ) అధ్యక్షుడు ఆదిశ్‌ సి అగ్రవాల్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సీజేఐకు ఆయన గురువారం ఓ లేఖను రాశారు. సుప్రీంకోర్టులో ఓ ధర్మాసనం ముందు విచారణకు లిస్టైన కేసులను అనూహ్యంగా మరో ధర్మాసనం ముందుకు మారుస్తున్నారంటూ దవే తన లేఖలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలంటూ అందులో సీజేఐకు విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని