అయోధ్యలో రామాలయాన్ని నిర్మిస్తామంటే ఎవరూ నమ్మలేదు

దేశంలోని బంధుప్రీతి, అవినీతి, కులతత్వం స్థానాలను గత పదేళ్లలో అభివృద్ధితో భర్తీ చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పేర్కొన్నారు.

Published : 09 Dec 2023 05:29 IST

 ప్రపంచం మొత్తం భారత్‌ వైపు చూస్తోంది : అమిత్‌షా

దిల్లీ: దేశంలోని బంధుప్రీతి, అవినీతి, కులతత్వం స్థానాలను గత పదేళ్లలో అభివృద్ధితో భర్తీ చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. శుక్రవారం ఆయన దిల్లీలోని బురారీలో ఏబీవీపీ జాతీయ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ యువత కోసం బంగారు భవిష్యత్‌ ఎదురుచూస్తోందని, విద్య కేవలం భవిష్యత్తును రూపొందించుకోవడానికే కాకుండా దేశ నిర్మాణంలోనూ ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం వివిధ సమస్యల పరిష్కారం కోసం భారతదేశం వైపు చూస్తోందని ఆయన అన్నారు. సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం, అభివృద్ధి చేయడం రెండూ వేర్వేరు కాదని చెప్పారు. తాము అయోధ్యలో రామమందిరాన్ని నిర్మిస్తామంటే ఎవరూ నమ్మలేదని, నిర్మాణాన్ని పూర్తిచేస్తామని అనుకొని ఉండరని ఆయన వ్యాఖ్యానించారు. విద్యావ్యవస్థలో అసంపూర్ణతలకు వ్యతిరేకంగా పోరాడడమే కాకుండా విద్యార్థుల లక్షణాలను పెంపొందించడంలో ఏబీవీపీ సహాయపడిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని