ముఖంపై పేడ వేసిన గేదె ఊపిరాడక చిన్నారి మృతి

ఊయలలో పడుకోబెట్టిన ఆరు నెలల చిన్నారి ముఖంపై గేదె పేడ వేసింది. దీంతో ఊపిరాడక ఆ బాబు అక్కడికక్కడే మృతిచెందాడు.

Published : 09 Dec 2023 05:18 IST

ఊయలలో పడుకోబెట్టిన ఆరు నెలల చిన్నారి ముఖంపై గేదె పేడ వేసింది. దీంతో ఊపిరాడక ఆ బాబు అక్కడికక్కడే మృతిచెందాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో ఈ ఘటన జరిగింది. కుల్పహాడ్‌ ఠాణా పరిధిలోని సతారి గ్రామానికి చెందిన ముకేశ్‌యాదవ్‌, నికిత దంపతులు వ్యవసాయం ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. వీరికి యాదవేంద్ర (3), ఆయుష్‌ (6 నెలలు) అనే ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. బుధవారం సాయంత్రం నికిత గేదెలకు మేత వేసేందుకు వెళ్లింది. అదే సమయంలో ఆయుష్‌ ఏడవటం మొదలుపెట్టేసరికి బాబును తీసుకువెళ్లి పశువుల పక్కనే ఉన్న ఊయలలో పడుకోబెట్టింది. కాసేపటి తర్వాత వచ్చి చూసేసరికి ఆయుష్‌ ముఖంపై పేడ ఉంది. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే జిల్లా ఆస్పత్రికి తీసుకువెళ్లగా ఊపిరాడక చిన్నారి మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని