Vegan Technology: ‘శాకాహార’ సంచులు, పాదరక్షలు!

తోలుకు ప్రత్యామ్నాయంగా మొక్కల వ్యర్థాలతో వివిధ వస్తువులు తయారు చేసే విధానాన్ని తిరువనంతపురానికి చెందిన సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్‌ డిసిప్లినరీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (సీఎస్‌ఐఆర్‌) అభివృద్ధి చేసింది.

Updated : 09 Dec 2023 08:52 IST

‘వీగన్‌’ సాంకేతికతతో తయారీ

ఈనాడు, బెంగళూరు: తోలుకు ప్రత్యామ్నాయంగా మొక్కల వ్యర్థాలతో వివిధ వస్తువులు తయారు చేసే విధానాన్ని తిరువనంతపురానికి చెందిన సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్‌ డిసిప్లినరీ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (సీఎస్‌ఐఆర్‌) అభివృద్ధి చేసింది. వీగన్‌ ప్లాంట్‌ బేస్డ్‌ టెక్నాలజీతో తయారు చేసిన జాకెట్లు, పర్సులు, బూట్లు, చెప్పులు, చేతి సంచులను మైసూరులో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఆహార సమ్మేళనంలో శుక్రవారం ప్రదర్శించారు. ఈ వస్తువులు చెరకు పిప్పి, వరి, గోధుమ పొట్టు, మామిడి టెంక, పీచుతో తయారుచేసినవి, పర్యావరణానికి ఎలాంటి హాని తలపెట్టవు అని సంస్థ ప్రతినిధులు చెప్పారు. సాధారణ తోలు, సింథటిక్‌ ముడి సరకుతో పోలిస్తే ఈ వస్తువుల తయారీకి తక్కువ పెట్టుబడి అవుతుంది. మన్నిక కాలం సుమారు మూడేళ్లు. భూమిలో సులభంగా కలిసిపోతాయి. రైతులకు ఆదాయాన్ని సృష్టించగలిగే ఈ తరహా ముడి సరకుతో జౌళి, ఫ్యాషన్‌, మోటారు వాహనాల్లో వాడే వస్తువులను కూడా తయారు చేయొచ్చని ఈ సంస్థ చెబుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని